బిగ్‌‘సి’ 150వ షోరూమ్‌ ప్రారంభం | Actor Samantha Launches 150th BIG C Mobile Showroom | Sakshi
Sakshi News home page

బిగ్‌‘సి’ 150వ షోరూమ్‌ ప్రారంభం

Jul 24 2017 12:36 AM | Updated on Sep 5 2017 4:43 PM

బిగ్‌‘సి’ 150వ షోరూమ్‌ ప్రారంభం

బిగ్‌‘సి’ 150వ షోరూమ్‌ ప్రారంభం

ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయాల సంస్థ బిగ్‌‘సి’ హన్మకొండలో 150వ షోరూమ్‌ను ప్రారంభించింది. సినీ నటి సమంత ప్రత్యేక అతిథిగా పాల్గొని షోరూమ్‌ను ప్రారంభిం చారు.

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయాల సంస్థ బిగ్‌‘సి’ హన్మకొండలో 150వ షోరూమ్‌ను ప్రారంభించింది. సినీ నటి సమంత ప్రత్యేక అతిథిగా పాల్గొని షోరూమ్‌ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ ఎం.బాలుచౌదరి మాట్లాడుతూ... మిగిలిన అన్ని షోరూమ్‌ల మాదిరిగా హన్మకొండ షోరూమ్‌నూ అత్యాధునికంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. ప్రారంభ ఆఫర్ల కింద మొబైల్స్‌ కొనుగోలుపై ట్రాలీ సూట్‌కేస్, సింగర్‌ మిక్సర్, లోటో షూ, లోటో సన్‌గ్లాస్, ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ తదితర బహుమతులను అందిస్తున్నట్టు తెలిపారు. కస్టమర్ల ఆదరణతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పట్టణానికి బిగ్‌‘సి’ విస్తరించినట్టు పేర్కొన్నారు. 100వ షోరూమ్‌ ప్రారంభించిన తానే తిరిగి 150వ షోరూమ్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందని నటి సమంత అన్నారు. సంస్థ ఇంత వేగంగా విస్తరించడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement