అమెజాన్‌ ‘కళా హాత్‌’లో 280 రకాల ఉత్పత్తులు

280 Types Of Products On Amazon Art Hat - Sakshi

2020 చివరికి 500కు చేరుస్తాం

‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ తన పోర్టల్‌లో ‘కళా హాత్‌’ పేరిట నిర్వహిస్తున్న స్టోర్‌లో 280 రకాల కళారూపాల తాలూకు ఉత్పత్తులు నమోదయ్యాయని ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వరగంటి చెప్పారు. 2020 చివరి నాటికి 500 రకాల కళారూపాలను ఈ–కామర్స్‌ పోర్టల్‌లో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారాయన. కాటమరాన్‌ వెంచర్స్, అమెజాన్‌ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్‌... ఈ ‘కళా హాత్‌’ను ప్రమోట్‌ చేస్తోంది. ‘సాధారణంగా విక్రేతల నుంచి అమెజాన్‌ 16 శాతం కమిషన్‌ తీసుకుంటుంది. కళా హాత్‌ కింద నమోదైన విక్రేతలకు ఇది 8 శాతమే. ప్రతి క్లస్టర్‌లో మా ప్రతినిధి ఒకరు నిరంతరం ఉండి వారి వ్యాపార వృద్ధికి తోడ్పాటు అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తారు.

చేనేత, హస్త కళాకారులకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. వారి ఉత్పత్తుల లిస్టింగ్, 3డీ మోడలింగ్‌ ప్రక్రియ అంతా మేమే చూసుకుంటాం’ అని శుక్రవారమిక్కడ సాక్షి బిజినెస్‌బ్యూరో ప్రతినిధికి వివరించారు. పోచంపల్లి ఇక్కత్, మంగళగిరి, కళంకారీ, పశీ్మనా, మధుబని, రోగన్, లిప్పన్‌ కామ్, ధరీజ్‌ వంటి సంప్రదాయ చేనేత వ్రస్తాలన్నీ దీన్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో  5,000 పైచిలుకు సంఘాలు, మాస్టర్‌ వీవర్స్, గోల్కొండ, లేపాక్షి వంటి సంస్థలతో చేతులు కలిపినట్లు చెప్పారు.  

రాష్ట ప్రభుత్వాలు తోడుంటే..
కళా హాత్‌ కింద నమోదైన చేనేత, హస్త కళాకారులకు ఒక్కొక్కరికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10,000ల నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. ఇటువంటి విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్, జమ్మూ,కాశ్మీర్, తమిళనాడు ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని సందీప్‌ వెల్లడించారు.  తెలంగాణ నుంచి 180, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 150 మంది కళాకారులు ప్రస్తుతం కళా హాత్‌ కింద నమోదయ్యారన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top