23 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ | 23 FDI proposals approved | Sakshi
Sakshi News home page

23 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్

Jul 14 2015 12:30 AM | Updated on Oct 4 2018 5:15 PM

బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది...

న్యూఢిల్లీ: బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సారథ్యంలో సోమవారం సమావేశమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) 47 ప్రతిపాదనలను పరిశీలించింది. గ్రీన్‌సిగ్నల్ లభించిన వాటిలో మైలాన్ ల్యాబరేటరీస్, జీఎస్‌కే ఫార్మా, డెన్ నెట్‌వర్క్స్ మొదలైనవి ఉన్నాయి. మరోవైపు రిలయన్స్ గ్లోబల్‌కామ్,  సిస్టెమా శ్యామ్ టెలీ ప్రతిపాదనలపై నిర్ణయాలను ఎఫ్‌ఐపీబీ వాయిదా వేసింది. 2013-14లో 24.29 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా .. 2014-15లో 27% పెరిగి 30.93 బిలియన్ డాలర్లకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement