కోచింగ్‌ సెంటర్లపై 18% జీఎస్టీ: ఏఏఆర్‌ | 18percent on coaching centers GST: AAR | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్లపై 18% జీఎస్టీ: ఏఏఆర్‌

May 18 2018 1:38 AM | Updated on May 18 2018 1:38 AM

18percent on coaching centers GST: AAR - Sakshi

న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్‌ కేంద్రాలు 18 శాతం జీఎస్టీ చెల్లించాలని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌(ఏఏఆర్‌) స్పష్టం చేసింది. ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాల సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయా అన్న అంశంపై అడ్వాన్స్‌ రూలింగ్‌ కోరుతూ మహారాష్ట్ర ఏఏఆర్‌ బెంచ్‌ ముందు దాఖలైన దరఖాస్తుకు పైవిధంగా బదులిచ్చింది.

ఎంబీబీఎస్, ఇంజనీరింగ్‌ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న ‘సింపుల్‌ శుక్లా ట్యుటోరియల్స్‌’ జీఎస్టీ నిర్వచనం పరిధిలో లేని సంగతిని బెంచ్‌ గుర్తించింది. ‘ఆ సంస్థకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక లేదు. పరీక్షలు నిర్వహించదు. డిగ్రీలు ప్రదానం చేయదు. ఈ కేసులో 9 శాతం కేంద్ర జీఎస్టీ, 9 శాతం రాష్ట్ర జీఎస్టీ వసూలు చేయాల్సిందే’ అని తెలిపింది. పన్ను సంబంధ కేసులు, వివాదాలను పరిష్కరించడానికి ఏఏఆర్‌లు పనిచేస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement