వేస్ట్‌ టు క్రాఫ్ట్‌.. | waste to craft | Sakshi
Sakshi News home page

వేస్ట్‌ టు క్రాఫ్ట్‌..

Jan 25 2018 3:04 PM | Updated on Jan 25 2018 3:04 PM

waste to craft - Sakshi

విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు

భద్రాచలంటౌన్‌ : పర్యావరణానికి ప్రమాదకారిగా మారిన వ్యర్థాలతో స్థానిక క్రాంతి విద్యాలయం విద్యార్థులు ‘వేస్ట్‌ టూ క్రాఫ్ట్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం పాఠశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమలోని సృజనాత్మకతతో వ్యర్థాలతో అందమైన వస్తువులను తయారు చేశారు. ఖాళీ కప్పులతో తయారు చేసిన టవర్, గిఫ్ట్‌ పేపర్స్‌తో చేసిన రోజాపూలు, అట్టముక్కలతో తయారు చేసిన నగలపెట్టె, చిత్తు కాగితాలతో చేసిన ఇంటి నమూనా, వాల్‌ హ్యంగ్స్, వివిధ రకాల వస్తువులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ సమతా శ్రీనివాస్, హెచ్‌ఎం అనురాధలు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు 5ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా వారిని తీర్చిదిద్ధటమే లక్ష్యంగా సాగుతున్నాట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement