‘అక్షయపాత్ర’కు అప్పగిస్తే ఊరుకోం | mid day meal workers oppose privatisation in bhadradri district | Sakshi
Sakshi News home page

‘అక్షయపాత్ర’కు అప్పగిస్తే ఊరుకోం

Feb 2 2018 6:44 PM | Updated on Feb 2 2018 6:44 PM

mid day meal workers oppose privatisation in bhadradri district - Sakshi

మాట్లాడుతున్న మధ్యాహ్న వర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ

చుంచుపల్లి : మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర సంస్థ ద్వారా నిర్వహించొద్దంటూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఫిబ్రవరి 1నుంచి కొత్తగూడెంలో పథకాన్ని ప్రారంభించాలని నాలుగు రోజుల క్రితమే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్న భోజన వర్కర్లు, సీఐటీయూ నాయకులు అక్షయపాత్ర కేంద్రం ఉన్న మార్కెట్‌ యార్డు వద్ద బైటాయించి ఆందోళనకు దిగారు.

ప్రభు త్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.లేకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను వెళ్లిపోవాలని పోలీసులు చెప్పే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్షయపాత్రను రద్దు చేయాలని ఆందోళనకారులు భీష్మిం చి కూర్చోడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: సీఐటీయూ
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పజెప్పి మధ్యాహ్న వర్కర్ల పొట్టగొట్టాలని ప్రభుత్వం చూస్తుం దని మధ్యాహ్న వర్కర్ల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ ఆరోపించారు. గురువారం అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అం దించాడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో పాల్గొని ఆమె మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్‌ ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయ పరంగా పోరాటం చేస్తున్న వర్కర్ల విషయంలో అధికారులు కనీసం కనికరం కూడా చూపడం లేదన్నారు.

వారు తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో దాదాపు 4 వేల మంది మధ్యా హ్న భోజన వర్కర్ల జీవితాలు రోడ్డు పడనున్నాయని అన్నారు. అధికారులు స్పందించి అక్షయపాత్రను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మధ్యాహ్న వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి జి.పద్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, బ్రహ్మచారి, తాటిపర్తి అనిల్, భూక్యా రమేష్, జి.రాజు, నలమలపు సత్యనారాయణ, మధ్యాహ్న భోజన వర్కర్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement