రైతుల బంగారం వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ | ysrcp stop the former Gold auction | Sakshi
Sakshi News home page

రైతుల బంగారం వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ

Jun 26 2014 1:10 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతుల బంగారం వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ - Sakshi

రైతుల బంగారం వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ

వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు.

నరసరావుపేట: వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బ్యాంకు వేలం పాటను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన పేరం విజయభాస్కరరెడ్డి బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష, ఆవుల కృష్ణారెడ్డి రూ.2 లక్షలు పైగా బ్యాంక్ ఆఫ్ ఇండియూలో రుణం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు రుణమాఫీని అమలు చేస్తామని చెబుతుండటంతో వాళ్లు రుణం చెల్లించే విషయంలో నిర్లిప్తత ప్రదర్శించారు.

దీంతో వీరి ఖాతాలకు చెందిన బంగారాన్ని వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సన్నద్ధమయ్యూరు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, మండల మైనార్టీ కన్వీనర్ మాబు సుభాని, దొండపాడు మాజీ సర్పంచ్ శివారెడ్డి, పట్టణ కార్యదర్శి వనిపంట కృష్ణారెడ్డి తదితరులు బ్యాంకు మేనేజర్ సుబ్బారావును కలసి ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే తీసుకున్న రుణం చెల్లిస్తామంటూ హామీపత్రం రాసి ఇవ్వడంతో వేలం ఆగిపోయింది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement