భారం మోపడం ఎంతవరకు కరెక్టు? | ysrcp slams petrol price hike | Sakshi
Sakshi News home page

భారం మోపడం ఎంతవరకు కరెక్టు?

May 1 2015 5:14 PM | Updated on Sep 3 2017 1:14 AM

భారం మోపడం ఎంతవరకు కరెక్టు?

భారం మోపడం ఎంతవరకు కరెక్టు?

మేడే కానుకగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ విమర్శించారు.

హైదరాబాద్: మేడే కానుకగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ విమర్శించారు. ఈవిధంగా ప్రజలపై పెట్రోభారం మోపడం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. 11 నెలల్లో కార్మికులకు ఏ మేలు చేశారని చంద్రబాబు వేడుకల్లో పాల్గొంటున్నారని నిలదీశారు.

అసంఘటిత కార్మికులకు చంద్రబాబు ఏం న్యాయం చేశారని అడిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల పొట్టకొట్టారని ధ్వజమెత్తారు. మేడే ఉత్సవాల్లో పాల్గొనే హక్కు చంద్రబాబు ఉందా అని ప్రశ్నించారు. రాజధాని రైతుల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జోడి రమేశ్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement