చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు: ఎమ్మెల్యే ఆర్కే | YSRCP MLA Alla Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు: ఎమ్మెల్యే ఆర్కే

Feb 23 2020 5:13 PM | Updated on Feb 23 2020 5:23 PM

YSRCP MLA Alla Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: అవినీతి, అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సిట్‌ వేయడంతో చంద్రబాబు అండ్‌ కో భయపడుతున్నారన్నారు. వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి రైతులు, ప్రభుత్వాన్ని చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆయన మండిపడ్డారు. రాజధానిలో పోలీస్‌, రెవెన్యూ అధికారులను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని రాజధాని రైతులకు  ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement