కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం | YSRCP Ledar katasani rami reddy son commits suicide | Sakshi
Sakshi News home page

కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం

Jun 15 2018 2:40 PM | Updated on Nov 6 2018 8:16 PM

YSRCP Ledar katasani rami reddy son commits suicide - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునరెడ్డి బలవన్మరణంతో కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. బీటెక్ పూర్తి చేసిన నాగార్జున ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. నిన్నరాత్రి కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన కుమారుడు.. తెల్లవారేసరికి విగతజీవిగా మారడంతో కాటసాని రామిరెడ్డి కుటుంబం షాక్‌కు గురైంది. నాగార్జునరెడ్డి ఆత్మహత్యకు గత కారణాలు తెలియరాలేదు. 

కాగా, కాటసాని నాగార్జున రెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డిలు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement