వికేంద్రీకరణకు మద్దతుగా.. అంబెద్కర్‌ విగ్రహానికి వినతి

YSRCP Leaders Gave Document Of Solicitation To Ambedkar Statue for Decentralization - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి  ప్రసాధించాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంబేద్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు.

పశ్చిమ  గోదావరి: ఐటీ సోదాల్లో ఎలుకలు దొరికాయని.. ఇంకా సోదాలు చేస్తే  ఏనుగులు, ఒంటెలు బయట పడతాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విఆర్‌ ఎలిజా అన్నారు. ఆయన శనివారం మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లాలోని జంగారెడ్డిగూడెం బస్‌స్టాప్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విఆర్‌ ఎలిజా మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అమరావతిలో పేద రైతుల వద్ద భూములు కొని ప్రభుత్వానికి అమ్మి.. బినామీ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హవాలా పద్ధతిలో వేల కోట్లు కాజేసిన చంద్రబాబు నాయుడిపై ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలు సమగ్ర విచారణ చేయాలన్నారు.

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో అభివృద్ధి వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా చేపట్టిని రిలే నిరాహార దీక్షలు పన్నెండవ రోజు కొనసాగుతున్నాయి.  ఈ రిలే నిరాహార దీక్షలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు.

పశ్చిమ గోదావరి: మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ది ప్రసాదించాలని  వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన అధ్యక్షులు మంతెన యోగేంద్రబాబు పాలకోడేరు మండలం శృంగవృక్షం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు , నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉండి గ్రామ వైఎస్సార్‌పీపీ కన్వీనర్ గుళ్ళు గొళ్లిపల్లి అచ్చారావు, ఉండి నియోజకవర్గ మహిళా కన్వీనర్ కటిక శ్రీదేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంతెన యోగేంద్రబాబు మట్లాడుతూ.. చంద్రబాబు  దోచుకున్న  రెండు లక్షల కోట్ల మోసం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందన్నారు.  త్వరలోనే టీడీపీకి ప్రజలందరూ బుద్ధి చెబుతారని అన్నారు.  చంద్రబాబు, లోకేష్ నాలుగు గోడల మధ్య దాక్కొని నోరు మెదపడం లేదు  ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  నాయకత్వంలో  రాష్ట్ర ప్రజలందరికీ అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 

ప్రకాశం: మూడు రాజధానులకు మద్దతుగా సింగరాయకొండ, టంగుటూరు, కొండెపిల్లో అంబేద్కర్ విగ్రహాలకు  కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య వినతి పత్రం సమర్పించారు.

గుంటూరు: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రం  సమర్పించారు.

అనంతపురం: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  తిప్పేస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు పీఏ  శ్రీనివాస్ వద్ద ప్రజల వద్ద నుంచి కొల్లగొట్టిన రూ. 2 వేల కోట్లు పట్టుబడడం చంద్రబాబు అవినీతికి నిదర్శనమన్నారు. చంద్రబాబు గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల డబ్బును దోచుకున్నారని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు.  చంద్రబాబు దోచుకున్న అక్రమ సంపాదనను రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిప్పే స్వామి అన్నారు. 

అనంతపురం: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని.. రాయదుర్గం మండలం మురిడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి వినతిపత్రం అందజేశారు. 

అనంతపురం: అధికార వికేంద్రీకరణ స్వాగతిస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కార్యకర్తలు, నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top