వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య | ysrcp leader murdered in kurnool district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య

Oct 23 2014 11:16 AM | Updated on May 29 2018 2:42 PM

వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య - Sakshi

వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య

కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఈరన్న గౌడ్ ను దుండగులు దారుణంగా హత్యచేశారు.

కౌతాళం: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఈరన్న గౌడ్ ను దుండగులు దారుణంగా హత్యచేశారు. ఆయనపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం మృతి చెందారు. 

బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన ఈరన్న రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలింపు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. రాజకీయపరమైన కక్షతోనే టీడీపీ వర్గీయులు ఈ కిరాతకానికి పాల్పడ్డారని ఈరన్న గౌడ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను అరెస్ట్  చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement