నెల్లూరు పట్టణంలోని రాధా ధియేటర్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీని వైఎస్ఆర్సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ లు పరామర్శించారు.
యాసిడ్ దాడి బాధితురాలికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
May 28 2014 10:50 AM | Updated on Oct 20 2018 6:17 PM
నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని రాధా ధియేటర్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీని వైఎస్ఆర్సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ లు పరామర్శించారు. కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మీ చందన ఈ దాడిలో గాయపడ్డారు. యాసిడ్ తక్కువ గాఢత కలిగినది కావడంతో ఆమెకు పెద్ద గాయాలు కాక పోవడంతో దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
లక్ష్మిపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైద్యసాయం అందిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement