'తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలి' | ysrcp leader alla nani slams ap govt over mega aqua food park | Sakshi
Sakshi News home page

'తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలి'

Oct 2 2016 2:08 PM | Updated on Aug 18 2018 8:08 PM

'తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలి' - Sakshi

'తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలి'

తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ నేత ఆళ్లనాని డిమాండ్ చేశారు.

భీమవరం : ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మెగా ఆక్వాఫుడ్ పార్క్ను నిర్మిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుందుర్రు ఫుడ్పార్క్ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది.  

ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ...తుందుర్రులో వెంటనే 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతోనే పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పార్టీ ముఖ్యనేతలు వంకా రవీందర్, దండి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కొయ్యే మోషేన్రాజు, గున్నం నాగరాజు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement