రైతు హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
ఏపీ రాజధాని ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లోని రైతుల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుడుగు వేసింది.
హైదరాబాద్: ఏపీ రాజధాని ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లోని రైతుల హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుడుగు వేసింది. దీనిలో భాగంగా రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసింది.
దీనిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, అంబటి రాంబాబు, కోడాలి నాని, మర్రి రాజశేఖర్, గొట్టిపాటి రవికుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉంటారు. రాజధాని నిర్మాణం పేరిట రైతులకు అన్యాయం చేస్తున్న అధికార పార్టీ ఆగడాలు, బెదిరింపు రాజకీయాలు ఎదుర్కొనేందుకు రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో కమిటీ పర్యటించనుంది.


