’పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలి’ | ysrcp demand re-survey of drowning Villages Of Polavaram | Sakshi
Sakshi News home page

’పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలి’

Sep 12 2016 1:16 PM | Updated on Aug 21 2018 8:34 PM

’పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలి’ - Sakshi

’పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలి’

పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

కాకినాడ : పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలవరం ముంపు బాధితుల పరిహారం పెంపుపై సోమవారం కాకినాడలో సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కన్నబాబు, ఉండవల్లి మాట్లాడుతూ పోలవరం నిర్మాణ సంస్థలపై దృష్టి సారించిన ప్రభుత్వం ...నిర్వాసితుల పరిహారంపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదంటున్న కేంద్రం, చట్టంలో లేనివిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అప్పగించిందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement