తిరుపతిలో బీసీ సన్నాహక సదస్సు

YSRCP BC Preparatory Summit In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : తుమ్మలగుంటలోని వైఎఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం బీసీ గర్జనపై రాయ‌ల‌సీమ రీజియన్ సన్నాహక  సదస్సు జరిగింది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 17న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో నిర్వ‌హిస్తున్న బీసీ గ‌ర్జ‌న మ‌హాస‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిప‌డ్డారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జనను నిర్వహించి వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వరప్రసాద్‌, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మిథున్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్రాధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సంజీవయ్య, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కుప్పం ఇంచార్జి చంద్రమౌళి, రాయలసీమ, నెల్లూరు జిల్లా కో ఆర్డినేటన్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top