కార్యకర్తల హోరు.. ప్రచారం జోరు

YSRCP Active Election Compaign In Darmavaram - Sakshi

ఓంకారేశ్వరుడి ఆశీర్వాదంతో జనవాహిని మధ్య ప్రచారం ప్రారంభించిన కేతిరెడ్డి  

సాక్షి, బత్తలపల్లి : వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మొదటిరోజు ఎన్నికల ప్రచారం గురువారం చేపట్టారు. ముందుగా శ్రీతలితా త్రిపుర సుందరీ సమేత శ్రీఓంకారేశ్వరుడి సన్నిధిలో పూజలు చేశారు. అక్కడ వేదపండితుల ఆశీర్వాదం తీసుకొని ఆశేష జనవాహిని మధ్య ప్రచారం చేపట్టారు.

అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలో మహిళలు హారతులు పట్టి, స్వాగతం పలికారు. మైనార్టీ కాలనీ, ఎస్టీ కాలనీ, వడ్డెర వీధి, వాల్మీకుల వీధి, పాతవూరు, నాలుగు రోడ్లలోనూ ప్రచారం నిర్వహించారు. ఆయా కాలనీల్లో స్థానికులు సమస్యలను కేతిరెడ్డి దృష్టికి తెచ్చారు.  వృద్ధులకు పింఛన్‌ రూ.3వేలు పెంచుతామన్నారు. ఇంటింటా ఓటర్లను కలిసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వివరించారు.

ప్రచారంలో ఎంపీపీ కోటి బాబు, వైస్‌ ఎంపీపీ గొల్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు అక్కిం నరసింహులు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గజ్జెల వెంగళరెడ్డి, మాతంగి రామాం జనేయులు, వడ్డె కృష్టా, బగ్గిరి రామ్మోహన్‌రెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ కరీంసాబ్, మాజీ సర్పంచులు సానే సూర్యనారాయణరెడ్డి, సంజీవు, లక్ష్మీనారాయణ, జయరామిరెడ్డి, కప్పల నారాయణస్వామి, చిన్న లింగారెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్లు సానే జయచంద్రారెడ్డి, జాంపుల చంద్రమోహన్, డి.చెర్లోపల్లి చల్లా కృష్టా, దరూరి రామకృష్ణ, గుజ్జల ముసలయ్య, సండ్రా రామకృష్ణ, రాంభూపాల్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సీతా రామిరెడ్డి, నాగేంద్ర, రమేష్, గరిశలపల్లి చిన్నా, ఈశ్వరయ్య  పాల్గొన్నారు.

ప్రచారం షురూ : వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ  సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బత్తలపల్లి నుంచి ప్రచారం ప్రారంభించారు. స్థానిక శివాలయంలో పూజలు అనంతరం ప్రచారం ప్రారంభించారు.అన్నా.. మీరు గెలవాలి , అన్నా.. మీరు గెలవాలన్నా.. మాలాంటి వారికి అండగా ఉండాలంటూ మానసిక వికలాంగుడు ఇమాముద్దీన్‌ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డితో అన్నాడు.

గురువారం బత్తలపల్లి ప్రచారంలో చేసిన సమావేశంలోకి వచ్చి అన్నతో మాట్లాడాలని కోరారు. దీంతో వేదిక దిగి వచ్చి బాలుడుతో మాట్లాడారు. దీంతో ఆ బాలుడు ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన   బత్తల పల్లి నూరుల్లా, వెంకటగారిపల్లి  శేఖర్‌ను కేతిరెడ్డి పరామర్శించారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top