కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్య భరోసా | YSR Health Sri For More Than 95 Percent Of Families Starting January 1 | Sakshi
Sakshi News home page

కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్య భరోసా

Dec 21 2019 4:33 AM | Updated on Dec 21 2019 4:33 AM

YSR Health Sri For More Than 95 Percent Of Families Starting January 1 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 95 శాతానికి పైగా కుటుంబాలకు జనవరి 1వ తేదీ నుంచి ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ వర్తింపచేస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచి్చన మాట మేరకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి అర్హత పొందేందుకు ఆదాయ పరిమితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీగా పెంచడంతో రాష్ట్రంలో అత్యధిక కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందే 1,43,04,823 కుటుంబాలతో అర్హుల జాబితాను శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించారు.

సామాజిక తనిఖీల్లో భాగంగా ఈనెల 26వ తేదీ వరకు అక్కడ పేర్లను పరిశీలించుకునేందుకు అవకాశం కలి్పంచారు. జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులను ఈ నెల 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. అందుకు అనుగుణంగా సవరించి ఈ నెల 27వ తేదీన గ్రామ, వార్డు సభలను నిర్వహించి లబ్ధిదారుల తుది జాబితాను ఆమోదిస్తారు. అనంతరం ఆ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సూచిస్తారు. అర్హులు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

‘వైఎస్సార్‌ నవశకం’తో ఇంటింటి సర్వే
వైఎస్సార్‌ ఆర్యోగ్యశ్రీ కార్డులను ప్రత్యేకంగా జారీ చేసేందుకు ‘వైఎస్సార్‌ నవశకం’ ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్జుల జారీకి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలుగా నిర్ణయించడంతో 95 శాతానికిపైగా కుటుంబాలు దీనికి అర్హత సాధించాయి.  
►రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో లబ్ధి చేకూరే 1,43,04,823 కుటుంబాల జాబితాను శుక్రవారం ప్రదర్శించారు.
►జనవరి 1వ తేదీ నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల ప్రింటింగ్, జారీ ప్రక్రియ ప్రారంభం.
►‘నవశకం’ సర్వే సందర్భంగా తాము పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామని, అత్యధిక వేతనంతో ఉద్యోగం చేస్తున్నామని, ఈ పథకానికి తాము అర్హులు కాదంటూ కొంతమంది లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement