నేడు వైఎస్సార్ వర్ధంతి | YSR death anniversary today | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్ వర్ధంతి

Sep 2 2014 12:29 AM | Updated on Aug 27 2018 9:19 PM

నేడు వైఎస్సార్ వర్ధంతి - Sakshi

నేడు వైఎస్సార్ వర్ధంతి

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మంగళవారం నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.

  • గ్రామగ్రామాన సేవా కార్యక్రమాలు
  • విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మంగళవారం నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.  ఐదో వర్ధంతి సందర్భంగా గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఉదయాన్నే పార్టీ నేతలు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళలర్పించనున్నారు. అనంతరం నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీ అట్టడుగు వర్గాల వారికి ఇతోధికంగా సాయపడనున్నారు. ఆస్పత్రులు, అనాథ శరణాలయాల్లో పండ్లు, రొట్టెల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని కొణతాల, గుడివాడ కోరారు.
     

Advertisement
 
Advertisement
Advertisement