ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
నత్తారామేశ్వరం (పెనుమంట్ర) : ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన పెనుమంట్ర మండ లం నత్తారామేశ్వరంలోని ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా వంటి పార్టీల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ప్రజాసమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వంతో వైఎస్సార్ సీపీ ఒంటరిగా వీరోచిత పోరాటం చేయూల్సి వస్తోందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో రాష్ట్రానికి చె ం దిన పలు విషయాలను ప్రశ్నించడంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురు ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా లేదని, ప్రజలకు చెప్పిన కార్యక్రమాలకు భిన్నంగా ఉందని చెప్పారు.
సీఎం చంద్రబాబు శాసనసభలో చెబుతున్న మాటలు అసత్యాలుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష సభ్యులకు ప్రశ్నించే అవకాశం కల్పించకపోవడం శాసనసభ నిర్వహణ నిబంధనలకు విరుద్ధమన్నారు. అసెంబ్లీలో వ్యక్తిగత ఆరోపణలకు అనుమతిస్తున్నారే తప్ప ప్రజాసమస్యలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు చంద్రబాబు వైఖరిని గమనిస్తున్నారని తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం చేరుుంచిన దాడులు, పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడే బాధితులను అణచివేసే ధోరణులను మునుపెన్నడూ చూడలేదని చెప్పారు.
రామేశ్వరుని సన్నిధిలో..
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామి ఆలయూన్ని సందర్శించారు. స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు దేవస్థానం మాజీ చైర్మన్ కొవ్వూరి త్రిమూర్తిరెడ్డి, అధికారులు, అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధితో పాటు ఆలయ విశిష్టతను అభిషేక పండితుడు సూరిబాబు ఆయనకు వివరించారు. అనంతరం గ్రామ ఉపసర్పంచ్ ద్వారంపూడి సత్యనారాయణరెడ్డి నివాసంలో గ్రామాభివృద్ధిపై ధర్మాన చర్చించారు. సర్పంచ్ చవ్వాకుల లక్ష్మి, మాజీ సర్పంచ్ కొక్కిరాల సత్యనారాయణ, నాయకులు కర్రి రామలింగేశ్వరరెడ్డి, జుత్తిగ ఎంపీటీసీ సభ్యురాలు వెలగల వెంకటరమణ, పెనుమంట్ర సొసైటీ మాజీ అధ్యక్షుడు తేతలి వెంకటరెడ్డి, కర్రి వేణుబాబు, పంచాయతీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.