అది మాయనాడు | YSR CP leaders comments on Telugu Desam Party | Sakshi
Sakshi News home page

అది మాయనాడు

May 31 2016 12:23 AM | Updated on Oct 8 2018 5:28 PM

తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహా నాడు ఓ మాయా వేదిక అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు.

మహానాడుపై వైఎస్‌ఆర్ సీపీ నేతల ధ్వజం
శ్రీకాకుళం అర్బన్: తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహా నాడు ఓ మాయా వేదిక అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వోత్కర్షలు తప్ప సమస్యల ప్రస్తావన లేదన్నారు. మూడు రోజులూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించడానికే సరిపోయిందన్నారు. కరువుపై కనీస చర్చ లేకపోవడం దారుణమన్నారు. గత ఏడాది వైజాగ్‌లో సమీక్ష చేసినప్పుడు రూ.4లక్షల కోట్లు వచ్చాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదన్నారు.

జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో అభివృద్ధిలో వెనుక ఉంది కాబట్టే మ హానాడులో అచ్చెన్నాయుడు వెనుకసీటుకు పరిమితమయ్యారని విమర్శిం చారు. సమావేశంలో పార్టీ నేతలు సాధు వైకుంఠరావు, శిమ్మ వెంకట్రావు, ఆర్‌ఆర్ మూర్తి, గుడ్ల మల్లేశ్వరరావు, కొత్తపల్లి నారాయణరావు, సనపల నారాయణరావు, పాలిశెట్టి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
 
ప్రజలను మోసగించేందుకే...
శ్రీకాకుళం అర్బన్: ప్రజలను మోసగించేందుకే చంద్రబాబు మహానాడు నిర్వహించారని వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరాడ తిలక్ అన్నారు. ఆయన సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. సీఎం స్థాయి వ్యక్తి హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం తగదన్నారు. కార్యకర్తలు చెప్పినట్లు చేయాలని ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా ఆదేశించడం శోచనీయమన్నారు.

కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ఉపా ధి పనులు ఆపేసి టీడీపీ నాయకుల కోసం నీరు-చెట్టు పనులు చేపట్టడం అన్యాయమన్నారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి తిర్లంగి జానకిరామయ్య మాట్లాడుతూ 2014లో నిరుద్యోగ యువతను మోసపూరిత హామీలతో వం చించి వారి ఓట్లను దండుకున్న చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందారని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ నేతలు యర్రా చక్రవర్తి, కణితి నారాయణమూర్తి, సత్తారు సత్యం, చిన్ని జోగారావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement