రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం | ysr congress party YS Jagan mohan reddy receives grand welcome in renigunta airport | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

Feb 27 2015 8:50 AM | Updated on Jul 25 2018 4:09 PM

రేణిగుంటలో  వైఎస్ జగన్కు ఘన స్వాగతం - Sakshi

రేణిగుంటలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

చిత్తూరు :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్  ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

 

అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు చేరుకుంటారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజరు అవుతారు. వధూవరుల్ని ఆశీర్వదించి వైఎస్ జగన్ తిరిగి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ బయల్దేరి వెళతారు.

Advertisement
 
Advertisement
Advertisement