హైదరాబాద్లో ఎటు చూసినా ర్యాలీలే! | YSr Congress Party Rallies for Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఎటు చూసినా ర్యాలీలే!

Oct 26 2013 1:04 PM | Updated on May 25 2018 9:12 PM

హైదరాబాద్లో ఎటు చూసినా ర్యాలీలే! - Sakshi

హైదరాబాద్లో ఎటు చూసినా ర్యాలీలే!

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు జంట నగరాల నుంచి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు జంట నగరాల నుంచి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నేతృత్వంలో సమైక్యవాదులు సభకు తండోప తండాలుగా కదలివస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. దారి పొడుగునా సమైక్య నినాదాలు చేస్తూ సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

* అంబర్‌పేట కార్పొరేటర్‌ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో 3వేల మందితో బైక్ ర్యాలీ
* కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డేపల్లి నర్సింహరావు నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ
* శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ ముక్కారూపానందరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ
* సనత్‌నగర్ ఇంఛార్జ్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ
* కుత్భుల్లాపూర్ ఇంఛార్జ్ కొలను శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ

* కేపీహెచ్‌పీలో జార్జ్ హెర్బట్ ఆధ్వర్యంలో 100 మీటర్ల వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరణ, ర్యాలీగా బయల్దేరిన నేతలు
* రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్ సీపీ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో సభకు వేలాదిగా తరలివెళ్లిన కార్యకర్తలు

Advertisement
 
Advertisement
Advertisement