‘నిజమైన సమైక్యవాది జగన్‌మోహన్‌రెడ్డి’ | YSR Congress party president YS Jagan Mohan Reddy Samaiky Plaintiff | Sakshi
Sakshi News home page

‘నిజమైన సమైక్యవాది జగన్‌మోహన్‌రెడ్డి’

Jan 27 2014 1:29 AM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్రంలో నిజమైన సమైక్యవాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆపార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు.

వల్లూరు (తునిరూరల్), న్యూస్‌లైన్ :రాష్ట్రంలో నిజమైన సమైక్యవాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆపార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. తుని మండలం వల్లూరులో ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఆ సందర్భంగా దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన సభలో బోస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని దేశవ్యాప్తంగా జగన్ పర్యటించి వివిధ పార్టీల నాయకులను కోరారన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నారన్నారు.
 
వైఎస్సార్ సీపీ ఒక్కటే రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయగలదన్నారు. రానున్న ఎన్నికల్లో తుని అసెంబ్లీకి దాడిశెట్టి రాజాను, కాకినాడ పార్లమెంట్‌కు చలమలశెట్టి సునీల్‌ను గెలిపించాలని కోరారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా జిల్లాకు 59సార్లు వచ్చారని, జిల్లా అభివృద్దికి రూ.పదివేల కోట్లు నిధులు ఇచ్చారని జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తెలిరు. జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. చలమలశెట్టి సునీల్, దాడిశెట్టి రాజా, పి.కె. రావు, రావూరి వెంకటేశ్వరరావు, రొంగలి లక్ష్మి, అల్లు రాజబాబు, కుసుమంచి శోభారాణి, నారాయణరెడ్డి, మాకినీడి గంగారావు, లాలం బాబ్జి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement