ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో హైవే దిగ్బంధం | ysr congress party MlC thippareddy rasta roko at chennai - mumbai highway | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో హైవే దిగ్బంధం

Oct 6 2013 10:52 AM | Updated on May 25 2018 9:10 PM

సమైక్య రాష్ట్రానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డి.తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లెలోని అమ్మచెరువుమిట్ట వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.

సమైక్య రాష్ట్రానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డి.తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లెలోని అమ్మచెరువుమిట్ట వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దాంతో చెన్నై - ముంబై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమైక్య రాష్ట్రానికి మద్దతుగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య దీక్ష పేరిట చేపట్టిన ఆమరణ నిరాహర దీక్షకు ఆయన తన మద్దతు ప్రకటించారు.

 

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిప్పారెడ్డి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. డి.తిప్పాయి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రహదారి దిగ్బంధనంలో సమైక్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement