
నేడు కూడా బంద్: జగన్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ విభజించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ను రేపటి్కి వరకు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రజలు కోరుకుంటున్న సమైక్య రాష్ట్ర ఆకాంక్షను కేంద్రంలోని పెద్దలకు మరింత గట్టిగా తెలియజేసేందుకు శనివారం రెండోరోజు కూడా బంద్ పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయే ప్రాంత ప్రజలంతా బంద్‌లో పాల్గొనాలని కోరారు.
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తామిచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం రెండోరోజు కూడా అదేవిధంగా బంద్‌ను విజయవంతం చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు.