చిరస్మరణీయుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి | YS Rajasekhara Reddy Jayanti Celebration In YSR Kadapa | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

Jul 8 2018 11:16 AM | Updated on Jul 8 2018 11:16 AM

YS Rajasekhara Reddy Jayanti Celebration In YSR Kadapa - Sakshi

విద్యార్థులకు పలకలు, నోట్‌ పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాగేంద్రారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వైఎస్‌ జయంతి సందర్భంగా మండలంలోని కల్లూరులో శనివారం ఆయన విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలోని పీహెచ్‌సీ సమీపంలో ఉన్న వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూజా కార్యక్రమాలను నిర్వహించారు.  అనంతరం కల్లూరులోని మూడు ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 186 మంది విద్యార్థులకు పలకలు, నోట్‌ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జీవించి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్‌ సుబ్రమణ్యం, ఆదిశేషారెడ్డి, రాబర్ట్, ఎల్లయ్య, ఓబులేసు, లక్షుమయ్య, దళితవాడ యూత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement