
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి, కొమురం భీం వర్ధంతి
మహా పురుషులు వాల్మీకి, కొమురం భీంలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంది. వాల్మీకి జయంతి, కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
సాక్షి, హైదరాబాద్: మహా పురుషులు వాల్మీకి, కొమురం భీంలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంది. వాల్మీకి జయంతి, కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, భూమా శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశ్, వి.బాలమణెమ్మ, మచ్ఛా శ్రీనివాసరావు, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.