డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరు | YS Jaganmohan Reddy Review Meeting In Amaravati Over Civil Supplies Department | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరు

Sep 19 2019 4:12 PM | Updated on Sep 19 2019 4:31 PM

YS Jaganmohan Reddy Review Meeting In Amaravati Over Civil Supplies Department - Sakshi

సాక్షి, అమరావతి: డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ గురువారం  పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సరఫరా ఎలా జరుగుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరఫరా సాఫీగా సాగుతుందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 

ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్‌లో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని, సివిల్ సప్లైస్‌ కమిషనర్ కోన శశిధర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement