
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో వైఎస్ జగన్, కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.