పేరు మార్పుపై సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌ - Sakshi
Sakshi News home page

పేరు మార్పుపై సీఎం జగన్‌ సీరియస్‌

Nov 5 2019 11:25 AM | Updated on Nov 6 2019 3:38 PM

YS Jagan Serious Over Name Change Of Abdul Kalam Pratibha Award - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి  అబ్దుల్‌కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు  యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరునే పెట్టాలని సూచించారు. 

అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్‌ పూలే, అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement