భారత జవాన్లకు వైఎస్‌ జగన్‌ సెల్యూట్‌ | YS Jagan Salutes To Jawans Who Fought For Country In Kargil War | Sakshi
Sakshi News home page

భారత జవాన్లకు వైఎస్‌ జగన్‌ సెల్యూట్‌

Jul 26 2018 7:21 PM | Updated on Aug 20 2018 6:07 PM

YS Jagan Salutes To Jawans Who Fought For Country In Kargil War - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌ అఖండ విజయం సాధించింది. దేశంలోకి చొరబడిన ముష్కరులపై భారత జవాన్లు కార్గిల్‌ వద్ద గడ్డ కట్టే చలిలో 60 రోజుల పాటు పోరాడి దేశం మీసాన్ని తిప్పారు.

ఆ ఘన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్న ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘కార్గిల్‌లో దేశం కోసం పోరాడిన ప్రతి సైనికుడికి వందనం. సైనికుల వీరోచిత ప్రదర్శన, అసమాన ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.’ అని వైఎస్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement