ఏపీ కేబినెట్‌కు వైఎస్‌ జగన్‌ నవరత్నాల ఎఫెక్ట్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌కు వైఎస్‌ జగన్‌ నవరత్నాల ఎఫెక్ట్‌

Published Tue, Jul 18 2017 7:18 PM

ఏపీ కేబినెట్‌కు వైఎస్‌ జగన్‌ నవరత్నాల ఎఫెక్ట్‌ - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌కు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాల’  ఎఫెక్ట్‌ తగిలింది. తాము అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు పెన్షన్‌ ఇస్తామని వైఎస్‌ జగన్‌ ఇటీవల జరిగిన వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లాల్లో పర్యటన సందర్భంలోనూ ఆయన కిడ్ని బాధితులకు పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ హామీతో దిగొచ్చిన ఏపీ సర్కార్‌ కిడ్ని బాధితులకు రూ.2,500 పెన్షన్‌ ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.  కాగా ఏపీ కేబినెట్‌ ఇవాళ సుదీర్ఘంగా సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. కేబినెట్‌ నిర్ణయాలు....
 

  • ఏపీ స్టేట్‌ వాటర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • బెల్ట్‌ షాపుల తొలగింపుకు నిర్ణయం
  • రోడ్డుపై మద్యం సేవిస్తూ కనబడినా అరెస్ట్‌
  • బహిరంగ మద్యం వాడకం నివారణకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం
  • డయాలసిస్‌ రోగులకు రూ.2,500 పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం
  • ఇసుకు అక్రమ రవాణాపై చర్చించిన కేబినెట్‌
  • ప్రతి జిల్లాలో నలుగురితో కమిటీ వేయాలని నిర్ణయం
  • కలెక్టర్‌, ఎస్పీలతో పాటు మరో ఇద్దరితో కమిటీ
  • ఇసుక రవాణా చార్జీలపైనా నియంత్రణ ఉండాలని నిర్ణయం

Advertisement
Advertisement