వైఎస్‌ జగన్‌: సీఎం పర్యటనను జయప్రదం చేయాలి | YS Jagan Tour to West Godavari on January 3rd - Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనను జయప్రదం చేయాలి

Dec 30 2019 11:39 AM | Updated on Dec 30 2019 12:51 PM

YS Jagan Mohan Reddy Tour in West Godavari on January Third - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మైబాబు, ప్రసాద్‌

పశ్చిమగోదావరి, ఏలూరు రూరల్‌: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో ప్రారంభించనుండడం ఎంతో శుభ పరిణామమని  ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు దిరిశాల ప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఏలూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాల యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రసాద్‌ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని కృషి వల్ల సీఎం జనవరి 3న ప్రాజెక్టును ఏలూరులో ప్రారంభించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో వేలాది మంది పేదలు కార్యక్రమానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యసేవలు అందించే బహృత్తర కార్యక్రమ ప్రారంభోత్సవం చిరస్థాయిగా నిలిచిపోయేలా కృషి చేయాలని పార్టీ నాయకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, మంచెం మైబాబు అన్నారు. సుంకర చంద్రశేఖర్, తంగెళ్ల రాముతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement