జగన్ మాట ఉద్యమాలకు బాట | YS Jagan mohan reddy suggestion goes to movements | Sakshi
Sakshi News home page

జగన్ మాట ఉద్యమాలకు బాట

Nov 27 2014 2:09 AM | Updated on Jul 25 2018 4:07 PM

జగన్ మాట ఉద్యమాలకు బాట - Sakshi

జగన్ మాట ఉద్యమాలకు బాట

జగన్ మాట ఉద్యమాలకు బాటైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జగన్ మాట ఉద్యమాలకు బాటైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష సమావేశాలు కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయని అన్నారు. ఈ సమీక్షకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారని చెప్పారు.

సమావేశాల్లో పార్టీ అధినేత ఇచ్చిన సందేశం కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని పెంచిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశాలకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement