
ఉండవల్లి చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఉండవల్లి గ్రామం చేరుకున్న ఆయనకు పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఉండవల్లి నుంచి తన పర్యటనను ప్రారంభించారు.
పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించి రైతులు, రైతు కూలీలతో ఆయన మాట్లాడనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటన తర్వాత వైఎస్ జగన్ గుంటూరు చేరుకుని పార్టీ నేతలతో కొద్దిసేపు మాట్లాడి, అనంతరం హైదరాబాద్‌కు పయనం అవుతారు.