
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో మంచి మార్పులు కలగాలని జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.