నల్లగొండలో ఓదార్పు వాయిదా | Ys Jagan mohan reddy nalgonda tour has been postponed | Sakshi
Sakshi News home page

నల్లగొండలో ఓదార్పు వాయిదా

Mar 8 2014 1:49 AM | Updated on Oct 16 2018 8:50 PM

వైఎస్సార్‌సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

నేడు హైదరాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుల భేటీలో పాల్గొననున్న జగన్
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్‌సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శనివారం రెండో రోజు ఓదార్పు యాత్ర ముగించుకుని ఆదివారం నుంచి జగన్ నల్లగొండ జిల్లాలో యాత్ర చేయాల్సి ఉంది.
 
  అయితే, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే వెలువడడం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలతో జగన్ అత్యవసరంగా భేటీ కావాల్సి ఉందని తలశిల తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ పాల్గొంటారని, ఈ కారణంగా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నారని వివరించారు. మళ్లీ ఏ తేదీల్లో నల్లగొండ జిల్లాలో పర్యటించే ది తరువాత ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement