యూనిఫాం వేసుకొని ఆటో నడిపిన జగన్‌

YS Jagan Drives Auto In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, ఏలూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న  ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్ల మద్దతు  ఉంటుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ఆటో యూనిఫాం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు.

  • అవును ఆయన అందరివాడు..
  • ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి  ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే అన్నలా హామీలు ఇస్తున్నారు.
  • అలానే..14వ తేదీని ఏలూరు సభలో జగన్ ఆలో వాళ్లకు ఓ హామీ ఇచ్చారు.
  • సొంత ఆటో ఉన్న ప్రతి  ఒక్కరికీ..ఏడాదికి 10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.
  • ఆటోవాళ్లకు అండగా ఉంటానని చెప్పారు.
  • దీంతో ఆటోవాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
  • వైఎస్ జగన్‌ ను తమ గుండెలాంటి ఆటో ఎక్కించి సంతోషించారు.
  • పశ్చిమ గోదావరి జిల్లా మేదినరావుపాలెం  క్రాస్ దగ్గర ఆటో  ఎక్కారు.
  • దీంతో ఆటో  డ్రైవర్లు ఆనందంతో పొంగిపోయారు.

కాగా ఈ నెల 14న ఏలూరులో బహిరంగ సభ సాక్షిగా వైఎస్‌ జగన్‌ ...ఆటో డ్రైవర్లుకు హామీ ఇచ్చిన విషయం విదితమే. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆటో కొనుగోలు చేసేవారికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తుందని ఆయన ప్రకటన చేశారు. దీంతో వైఎస్‌ జగన్‌ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top