నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం:జగన్ | ys jagan demands, government should be given compensation for cyclone victims | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం:జగన్

Oct 21 2014 5:57 PM | Updated on Jul 25 2018 4:07 PM

హుదూద్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందేవరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

శ్రీకాకుళం:మంగళవారం జిల్లాలోని లావేరు మండలం మురపాకలో పర్యటించిన జగన్.. తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తుపాను బాధితులకు నష్టపరిహారంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.తుపాను బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

 

అవ్వా తాతలు, డ్వాక్రా అక్కా చెల్లెళ్లు, రైతన్నల కోసం నవంబర్ 5 వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement