అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించి వారిలో ఆత్మస్ధైర్యాన్ని నింపడానికి...
అనంతపురం: అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించి వారిలో ఆత్మస్ధైర్యాన్ని నింపడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లాలో మూడవ విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ శనివారం తెలిపారు. భరోసా యాత్రకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 21వ తేదీ కళ్యాణదుర్గంలోని శెట్టూరు నుంచి ప్రారంభమై 22, 23 తేదీలలో ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. 24నుంచి పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో చేపడతారు.
భరోసా యాత్ర షెడ్యూల్ ఇలా..
ఈ నెల 21వ తే దీన శెట్టూరులో మధ్యాహ్నం 1గంటకు బహిరంగసభ అనంతరం ఒక కార్యకర్త కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు.22వ తేదీన శెట్టూరు మండంలోని కైరేవు గ్రామంలో ఒక రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత కళ్యాణదుర్గం మండలంలోని ముదిగళ్ళు, వర్లి గ్రామాల్లోని రైతు కుటుంబాలను భరోసా కల్పిస్తారు.23వ తేదీన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం, తిమ్మాపురం, వంటారెడ్డిపల్లిలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర చేపడతారు.