వైఎస్‌ జగనన్న పాలన చరిత్రాత్మకం

YS Avinash Reddy Distribute Ramadan Gift in Pulivendula - Sakshi

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనన్న పరిపాలన చరిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం  పట్టణంలోని వైఎస్‌ పాల్‌రెడ్డి ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ మైనార్టీ నాయకుడు ఓతూరు రసూల్‌ సొంత నిధులతో ఏర్పాటు చేసిన రంజాన్‌ తోఫాను వైఎస్‌ మనోహరరెడ్డితో కలిసి సుమారు 500 మంది పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిలోపే మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ అమలు చేశారన్నారు.  రాష్ట్ర చరిత్రలో ఏముఖ్యమంత్రికి చెందని ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అశించిన విధంగా గ్రామ స్వపరిపాలనను వలంటీర్లు రూపంలో ప్రజల మందుకు తీసుకు వచ్చారన్నారు. రాబోవు నాలుగేళ్లలో మరిన్ని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తారన్నారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల  మేనిఫెస్టోలో 600 హమీలిచ్చి ఏ ఒక్క హమీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రూపొందించి హమీలనీ అమలు చేసి చూపించారన్నారు. టీడీపీ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి  తొలగించాన్నారు. అనంతరం ఆయన ముస్లిం సొదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనను పాటిస్తూ అందరూ రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ యాడ్‌ చైర్మన్‌ చిన్నప్ప, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వర ప్రసాద్, హాలు గంగాధర్‌రెడ్డి, మైనార్టీ నాయ కులు ఇమామ్‌బాషా, పకృద్దీన్, నజరుల్లా, బాబు, బాషా, విద్యార్థి సంఘం నాయకులు జశ్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top