గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి సజీవ దహనం | Youth died in cylinder blast | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి సజీవ దహనం

Nov 15 2015 12:34 PM | Updated on Sep 28 2018 3:41 PM

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

మదనపల్లి: చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మదనపల్లి నక్కలదిన్నె తండాలో రాజానాయక్ (28) ఒక్కడే ఇంట్లో ఉండగా, తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఇల్లు పూర్తిగా దగ్ధమవ్వడంతో, మంటల్లో చిక్కుకుని రాజానాయక్ మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement