రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | youth died in a road accident in chittoor district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Jan 9 2017 10:02 AM | Updated on Sep 18 2019 3:24 PM

తడ–వరదయ్యపాలెం రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

వరదయ్యపాలెం: చిత్తూరు జిల్లా తడ–వరదయ్యపాలెం ప్రధాన రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఇనమాలగుంట వద్ద ఆదివారం రాత్రి చోటచేసుకుంది. మత్తేరిమిట్ట పంచాయతీ పరిధి తొండూరు సొసైటీకి చెందిన రంజిత్‌(23) ద్విచక్ర వాహనంపై వరదయ్యపాలెం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం శ్రీసిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement