సేవా మల్లె ‘తులసి’

Young Woman Thulasi Blood Donation Story YSR kadapa - Sakshi

మీరు ప్రొద్దుటూరులో ఉన్నారనుకోండి... తిరుపతిలో ఎవరికైనా రక్తం అవసరమైతే ఏం చేస్తారు? సేవా గుణం ఉంటే వెళ్లి ఇస్తారు. అదే యువతి అయితే... తోడు లేకుండా ఇంట్లో వాళ్లు ధైర్యంగా పంపలేరు. పంపాలనుకున్నా ఆ యువతి అదే ధైర్యంతో వెళ్లాలి. అక్కడ ఏ టైం అవుతుందో, మళ్లీ తిరిగి రావడమెప్పుడో అనే ఆలోచన. ఎందుకు వచ్చిన సేవాగుణంలే అనుకుంటారు. కానీ తులసి అలా అనుకోలేదు. అవతలి వ్యక్తి ప్రాణాపాయమే కనిపించింది. తక్షణమే సొంత ఖర్చులతో వెళ్లి రక్తదానం చేస్తుంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

కడప ఎడ్యుకేషన్‌: సామాజిక మాధ్యమం రెండు వైపులా పదునైన కత్తిలాంటిది. ఇందులో ఆశయం దిశగా సాగితే విజ్ఞానం, వినోదం ఉంటాయి. ఏమాత్రం గురి తప్పినా జీవితాలు తారుమారవుతాయి. నేటి యువత మార్కెట్లో ఏ ట్రెండ్‌ వచ్చినా అందిపుచ్చుకుంటోంది. వాటిని అనుసరిస్తోంది. పేస్‌బుక్‌లో లైక్‌లు, కామెంట్లు, అప్‌డేట్లు ఇలా ఊహల గగనంలో విహరిస్తోంది. అదుపు తప్పితే మాత్రం కనిపించని విషవలయాలు ఉంటాయని నిపుణులు, మేధావులు హెచ్చరిçస్తున్నారు. త్వరలో పది, ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. వీటికి కేవలం రెండు నెలల మాత్రమే గడువు ఉంది. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ ఉంటే భవిష్యత్తు పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి   నుంచైనా పరీక్షలపై దృష్టి సారిస్తే మంచి గ్రేడ్‌లను సాధించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సేవ చేయడంలో కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన తులసి ముందుంటారు. రైల్వేలో చిరుద్యోగిగా పని చేస్తున్న రామకృష్ణారెడ్డి సతీమణి తులసి. తులసి భర్త 15 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా భర్త దారిలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలందుకుంటోంది. కాశినాయన మండలం ఉప్పలూరుకు చెందిన రామ తులసికి 2014లో కలసపాడు మండలంలోని తెల్లపాడుకు చెందిన రామకృష్ణారెడ్డితో వివాహామైంది. అప్పటికే వివేకానంద ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న అతను భార్యలోని సేవాగుణం చూసి సంస్థ కోశాధికారి బాధ్యతలను అప్పగించారు. భర్త సహకారంతో సేవలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.

అనాథలకు అన్నదానం చేస్తున్న రామతులసి
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేయడంతో పాటు వారికి మార్గదర్శిగా నిలుస్తూ మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు సంస్థ ద్వారా 3 వేల మందికి విద్యాసామగ్రి అందజేశారు. కళాశాలల్లోని బాలికలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, వివేకానంద సూక్తులతో స్ఫూర్తిని నింపుతోంది.ఇటీవలే ఒక యువకుడు రక్తం గడ్డకట్టే వ్యాధితో తిరుపతి సిమ్స్‌లో చేరాడు. అతనికి అరుదైన రక్త గ్రూపు అవసరం కావడంతో పత్రికల్లో సాయం చేయాలని కోరారు. దీన్ని ప్రొద్దుటూరులో చూసిన తులసి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు చిన్నపిల్లలు తప్ప వెంట రావడానికి ఎవరూ లేరు. అయినా ధైర్యంతో ఆమె పిల్లలతో వెళ్లి రక్త దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో చూసి పలువురు అభినందించారు.ప్రస్తుతం కాశినాయన మండలం ఓబులాపురం వద్ద వృద్ధుల సేవాశ్రమాన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నారు. భర్త ఎక్కువ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా తులసి నిర్మాణ పనుల బాధ్యత తీసుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటికే రూ.15 లక్షలతో నిర్మాణ పనులు పూర్తి చేశారు.

సేవలోనే సంతృప్తి
దూరం, ఒక్కరే వెళ్లాలన్న భయం కంటే అవతలి వ్యక్తి అవసరమే నన్ను కదిలించింది. అందుకే చిన్న పిల్లలున్నా వారిని వెంట తీసుకుని వెళ్లి రక్తదానం చేశా. అభాగ్యులు, పేదవారికి సేవ చేయడంలో సంతృప్తి ఉంటుంది. జీవితాంతం సేవ చేయాలనే ఉద్దేశంతోనే సేవాశ్రమం నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం.– రామ తులసి, వివేకానంద ఫౌండేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top