ఇద్దరు ఏజెన్సీ మహిళల ఆత్మహత్యాయత్నం | women suicide attempt in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఏజెన్సీ మహిళల ఆత్మహత్యాయత్నం

Mar 25 2016 12:57 PM | Updated on Sep 3 2017 8:34 PM

గత పదేళ్లుగా మధ్యాహ్న భోజనం వండుతున్న తమని కాదని.. కొత్తగా మరో ఇద్దరు మహిళలను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో..

విశాఖపట్నం : గత పదేళ్లుగా మధ్యాహ్న భోజనం వండుతున్న తమని కాదని.. కొత్తగా మరో ఇద్దరు మహిళలను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో.. మనస్తాపం చెందిన ఇద్దరు ఏజెన్సీ మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. పాఠశాల భవనం పైకి ఎక్కి తమను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని.. లేకపోతె ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని సర్దిచెప్పి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న కస్తూర్బా పాఠశాలలో పదేళ్లుగా వంట చేస్తున్న కాంతమ్మ(52), అమ్మాజి(42)లను అకారణంగా తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నట్లు తెలవడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో వారు పాఠశాల భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement