కొడికొండలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం | Women protest at CM Chandrababu meeting | Sakshi
Sakshi News home page

కొడికొండలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

Apr 21 2016 7:11 PM | Updated on Aug 14 2018 11:26 AM

కొడికొండలో రాగమయూరి ఎలక్ట్రానిక్ పార్క్కు సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు.

అనంతపురం : ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు సభలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొడికొండలో రాగమయూరి ఎలక్ట్రానిక్ పార్క్కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం సభలో మాట్లాడుతుండగా కొందరు మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపూర్లో రావత్ మసాలా కంపెనీ యాజమాన్యం ఉన్నఫళంగా 130మందిని విధుల నుంచి తొలగించిందని, వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళలు నినాదాలు చేశారు.

దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభలోనే ఆందోళనకారులపై దౌర్జన్యానికి దిగారు. మహిళలు, కార్మికులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో సీఐటీయూ నేత వెంకట నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement