వనితా వందనం

women auto driver special story - Sakshi

ఆటో నడుపుతూ కుటుంబ పోషణ

చిన్న వయసులోనే భర్తను కోల్పోయి...

నా అనే వారు ఆదరించకపోవడంతో అష్టకష్టాలు

కుటుంబ పోషణ కోసం పోరాటం

చేతి కష్టానికి తెలివి తోడు చేసుకుని..

ఎట్టకేలకు విజయపథం

కడప ,ప్రొద్దుటూరు క్రైం :  ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌కు చెందిన కొండిశెట్టి సుధ అనే మహిళ ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మగాళ్లకు దీటుగా స్వశక్తితో ఆటో నడపడాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.  అమృతానగర్‌కు చెందిన సుధాకు రామాంజనేయులుతో వివాహం అయింది. అతను ఎలక్ట్రికల్‌ ఉద్యోగం నిర్వహించే వాడు. వారికి లహరి అనే కుమార్తె ఉంది. సంతోషంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆ చిన్న కుటుంబంలో అనుకోని విషాదం నెలకొంది.

ఆమె భర్త రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన 9 ఏళ్ల క్రితం జరిగింది. భర్త మరణంతో కుటుంబ భారం ఆమెపై పడింది. కుమార్తెను బాగా చదివించాలని భావించింది.  మో టార్‌సైకిల్‌ను నడపడం నేర్చుకుంది. నిత్యావసర సరుకులు టీవీఎస్‌లో పెట్టుకొని పల్లెలకు వెళ్లి విక్రయించ డం అలవాటు చేసుకుంది. తర్వాత ఆటో కొనుగోలు చేసి నేర్చుకుంది. అందులో తీసుకెళ్లి సరుకులు విక్రయిం చింది. అయితే చాలా మంది అప్పు పెట్టారు. ఇలా రూ.2.50 లక్షల దాకా నష్టపోయింది.

ఆటో డ్రైవింగే జీవనాధారం
నిత్యావసరాల వ్యాపారం చేస్తే బాకీలు పెరిగిపోతాయని భావించి మానేసింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే  సంసారం గడచదని భావించింది.  ఎలాగో ఆటో నడపడం వచ్చు కాబట్టి ప్రయాణికుల కోసం తిప్పాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టింది. మూడేళ్ల నుంచి ఇదే ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రోజంతా ఆటో తిరిగితే రూ. 300–400 దాకా సంపాదిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top