జీవన ‘కళ’

Woman Struggling for Dairy Farming In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : హలం పట్టి పొలం దున్నే రైతన్న ధ్యేయం ధన సంపాదన కాదు.  మనిషికి ఇంత కూడు పెట్టాలనే సామాజిక బాధ్యత. ఆరుగాలం కష్టించి, ఎండనక వాననక, పురుగనక పుట్రనక, పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియకుండా, ఏటా గుండె దిటువు చేసుకుని మానవాళికి పట్టెడన్నం పెడుతున్న రైతుల దుస్థితి కరువు దెబ్బకు ఛిద్రమైపోయింది. ‘కార్పొరేటు బాబు’ల దెబ్బకు పొలం ముక్కలై పోయింది. పుట్టి పెరిగిన కర్మ భూమినే కన్నబిడ్డగా భావించి ప్రళయ ప్రకృతి, అనైతిక వ్యాపారనీతి లాంటి అనేక విషమ పరిస్థితులను తట్టుకుంటూ పంట సాగు చేసి.. నష్టాలు మూటగట్టుకోలేక  పల్లె వదిలి పట్నం బాట పట్టిన రైతు కుటుంబాలు జీవనోపాధికి పడుతున్న ఇక్కట్లకు ప్రతిరూపమే ఈ చిత్రం.

ఆమె పేరు కళావతి.. పుట్టిపెరిగిన ఊరిని దశాబ్దాల క్రితమే వదిలి అనంతపురానికి కుటుంబంతో పాటు వచ్చి చేరుకున్నారు.  ఇలాంటి తరుణంలో పాడిపోషణ వారికి దిక్కైంది. నగరంలోని భవానీనగర్‌లో నివాసముంటూ గేదెలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నిత్యం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తడకలేరు సమీపంలో రైతులు పండించిన గడ్డిని కొనుగోలు చేసి ఇలా తన భర్త శివారెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి చేరవేస్తుంటారు. పాడి ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.  ఇది చదవండి : శ్రమలోనేనా సమానత్వం?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top